: కాశీకి వెళుతున్న కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్ పుణ్యక్షేత్రమైన కాశీకి వెళుతున్నారు. అయితే, ఆయన వెళుతున్నది కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసమనుకుంటే పొరపాటే. ఈ నెల 23వ తేదీన వారణాసి (కాశీ)లో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆ రోజు ఆయన ర్యాలీలో కూడా పాల్గొంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.