: హైదరాబాదులో ఓ వ్యక్తిపై కత్తితో దాడి
హైదరాబాదు, మసాబ్ ట్యాంకు చాచా నెహ్రూ పార్కు వద్ద ఫయాజ్ అనే వ్యక్తిపై ఆగంతుకులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫయాజ్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.