: సెల్ ఫోన్ మీట నొక్కి టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేయండి: చంద్రబాబు
నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సెల్ ఫోన్ నుంచి ఐవీఆర్ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు చంద్రబాబు ఈరోజు శ్రీకారం చుట్టారు. ఐవీఆర్ విధానంలో సూచించిన నలుగురు అభ్యర్థుల్లో ఒకరిని నియోజకవర్గ ప్రజలు ఎంపిక చేయవచ్చు. ఆ నలుగురిలో ఎవరూ ఇష్టం లేకపోతే సున్నా నొక్కి తిరస్కరించవచ్చునని ఆయన తెలిపారు. తన అభ్యర్థిత్వం పైనా ప్రజలు ఈ విధానం ద్వారా అభిప్రాయాన్ని తెలుపవచ్చునని చంద్రబాబు చెప్పారు. సాంకేతికతను వినియోగించుకుని ఐవీఆర్ ద్వారా అభ్యర్థుల ఎంపిక విధానాన్ని భారతదేశంలోనే తొలిసారిగా టీడీపీ ప్రవేశపెట్టింది.