: సీఎం పదవి కోసమే జగన్ విభజనకు సహకరించారు: కిరణ్


ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చిన ఘనత తమదేనని జేఎస్పీ అధినేత కిరణ్ చెప్పారు. దేశంలో తొలిసారి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చామని తెలిపారు. ఇవాళ ప్రభుత్వ ఖజానాకు 80 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని... తాము అధికారంలోకి వచ్చినప్పుడు 15 వేల కోట్ల రూపాయల అప్పులున్నాయని తెలిపారు. ఇదే సమయంలో కిరణ్ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం ముఖ్యమంత్రి పదవికోసమే జగన్ రాష్ట్ర విభజనకు సహకరించారని విమర్శించారు. ఆయనకు ప్రజల శ్రేయస్సు అవసరం లేదని ఆరోపించారు. జగన్, చంద్రబాబులిద్దరూ రాష్ట్ర విభజనకు లేఖలు ఇచ్చారని చెప్పారు.

  • Loading...

More Telugu News