: సోనియా స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ!
సోనియా, రాజీవ్ ల ముద్దుబిడ్డ ప్రియాంకా గాంధీ రాజకీయాలలోకి ప్రవేశించనున్నారనే వార్తలు మరోమారు ఢిల్లీలో జోరుగా వినిపిస్తున్నాయి. తల్లి సోనియా స్థానాన్ని ప్రియాంకా గాంధీ భర్తీ చేయనుందని అంటున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ స్థానం నుంచి 2014 ఎన్నికలలో ప్రియాంక పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో ప్రియాంక తరచుగా అక్కడ పర్యటిస్తోందని.. పలు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. మరి విశ్లేషకుల, రాజకీయ వర్గాల అంచనాలు నిజమవుతాయో, లేదో తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.