: రాష్ట్రం కలిసుంటేనే మంచిది: కిరణ్
విద్య, వైద్య, ఉద్యోగ సదుపాయాలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయిని... అలాంటిది రాష్ట్రాన్ని విభజించి, హైదరాబాదును ఒక ప్రాంతానికి కేటాయిస్తే ఎలాగని జేఎస్పీ అధినేత కిరణ్ ప్రశ్నించారు. సీమాంధ్రలో 150శాతం విద్యుత్ ఉత్పత్తి అవుతోందని... తెలంగాణలో కరెంటు లోటు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇరు ప్రాంతాలకు ఎన్నో సమస్యలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రం కలిసుంటేనే మంచిదని తెలిపారు. విశాఖలో జై సమైక్యాంధ్ర పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగుజాతి ఆత్మగౌరవ సభలో ఆయన ప్రసంగించారు.