: ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరు నటీమణుల పోటాపోటీ
ఇద్దరు బాలీవుడ్ నటీమణులు. ఒకరు గుల్ పనాగ్. మరొకరు అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్. గెలుపు కోసం చండీగఢ్ స్థానంలో తలపడుతున్నారు. పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కాగా, కిరణ్ ఖేర్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరిద్దరితో పోటీ పడి విజయం సాధించేందుకు మాజీ కేంద్ర మంత్రి పవన్ కుమార్ బన్సల్ కాంగ్రెస్ అభ్యర్థిగా చెమటోడుస్తున్నారు. ఇదే స్థానంలో మరో మహిళ జన్నత్ జహాన్ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.