: బేషరతుగా టీడీపీలో చేరాం: శత్రుచర్ల


ఎలాంటి షరతులు లేకుండా టీడీపీలో చేరామని మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు, ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజు తెలిపారు. ఈ రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధి కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని చెప్పారు. హైదరాబాదును అభివృద్ధి చేసింది చంద్రబాబే అని తెలిపారు. సీమాంధ్రలో టీడీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News