: మీరాకుమార్ పై తెలుగు మాజీ ఐఏఎస్ అధికారి పోటీ
బీహార్ లోని ససారం పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. మీరా ప్రత్యర్థిగా జనతాదళ్ (యునైటెడ్) తరపున తెలుగువాడైన మాజీ ఐఏఎస్ అధికారి కేపీ రామయ్య బరిలోకి దిగుతున్నారు. తొలి విడత అభ్యర్థుల జాబితాలో జేడీయూ... రామయ్య పేరును ప్రకటించింది. బీహార్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారైన రామయ్య పలు కీలక పదవులు నిర్వర్తించారు. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సంజయ్ పాశ్వాన్ రంగంలోని దిగారు. దీంతో, ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది.