: ప్రచారాస్త్రాలుగా... కాలర్ ట్యూనూ, పాలప్యాకెట్టు!
సెల్ ఫోన్ కాలర్ ట్యూన్, పాలప్యాకెట్... తదితరాలను వినూత్నంగా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మలుస్తున్నారు కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లా కలెక్టర్ హేమంత్ రాజ్. ఓటర్లలో చైతన్యాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హేమంత్ రాజ్ పాలప్యాకెట్లపై సందేశాలతో, మొబైల్ కాలర్ ట్యూన్ల ద్వారా 18 ఏళ్లు దాటిన యువత తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.