: 17న మోడీతో భేటీకి పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్?


సినీ నటుడు, జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఈ నెల 17న బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 17న మోడీతో సమావేశానికి పవన్ కు అపాయింట్ మెంట్ ఖారారైనట్లు సమాచారం. ఈ మేరకు ద హిందూ ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిని పవన్ కల్యాణ్ ధ్రువీకరించాల్సి ఉంది. తాను కాంగ్రెస్ తో తప్ప ఏ పార్టీతోనైనా కలసి పనిచేసేందుకు సిద్ధమని పవన్ జనసేన ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

అంతేకాదు, 'కాంగ్రెస్ కీ హటావో దేశ్ కీ బచావో' అంటూ పవన్ సమావేశం ముగింపు సందర్భంగా తాననడమే కాకుండా అభిమానులతోనూ అనిపించారు. అంటే కాంగ్రెస్ ను పారదోలి దేశాన్ని రక్షించండని ఆయన కోరారు. ప్రస్తుతం నరేంద్రమోడీ కూడా ఈ దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమేయాలంటూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ బీజేపీ, టీడీపీతో కలసి పనిచేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నట్లు హిందూ పత్రిక పేర్కొంది. రాజకీయాలపై తన అభిప్రాయాలతో పవన్ అతి త్వరలోనే పుస్తకాన్ని విడుదల చేయనున్నారని.. ఆ సందర్భంగానే భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News