: మలేషియా విమానం మా దేశంలోకి రాలేదు: పాకిస్థాన్


కొన్ని రోజుల క్రితం అదృశ్యమైపోయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి పాకిస్థాన్ లోని స్వాత్ లోయలోకి తీసుకెళ్లారనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. మలేషియా విమానం తమ భూభాగంలోకి ప్రవేశించలేదని స్పష్టం చేసింది. తప్పిపోయిన విమానం తమ దేశంలో ఉందన్న వార్తలను పాక్ ప్రధాన మంత్రి ప్రత్యేక సహాయకుడు సుజాత్ అజీమ్ ఖండించారు. డాన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడతూ, గల్లంతైన విమానం పాక్ లోకి ప్రవేశించినట్టు రాడార్లు ఎక్కడా గుర్తించలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News