: విజయవాడ బరిలో పురందేశ్వరి.. విశాఖలో హరిబాబు?


కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం పార్టీ ఎన్నికల కమిటీకి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, రెండో ప్రాధాన్యతగా నరసరావుపేట లోక్ సభ స్థానానికి కూడా దరఖాస్తు చేశారు. విజయవాడ లోక్ సభ స్థానం కోసం పురందేశ్వరితోపాటు మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి, మరో ఇద్దరు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ లోక్ సభ స్థానం నుంచి సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సినీ నటుడు కృష్ణంరాజుకి కాకినాడ లేదా నర్సాపురం దక్కే అవకాశాలున్నాయి. సీమాంధ్రలోని 25 లోక్ సభ స్థానాలకు 95 దరఖాస్తులు వచ్చాయి. వీటిలోంచి తుది జాబితాను ఖరారు చేయాల్సి ఉంది.

  • Loading...

More Telugu News