: రసమయి బాలకిషన్ కాంగ్రెస్ లోకి: పొన్నం
కళాకారుడు రసమయి బాలకిషన్ ఈ నెల 19న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేత మల్లేపల్లి లక్ష్మయ్య కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని పొన్నం చెప్పారు. టీఆర్ఎస్ తో పొత్తు లేదని స్పష్టమైన నేపథ్యంలో.. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన నేతలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.