: ప్రధాని అయినా ఆయన ఆస్తి మాత్రం కేవలం రెండు సెల్ ఫోన్లే


అవును... ఇది నిజం. నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా ఆస్తి కేవలం రెండు సెల్ ఫోన్లు మాత్రమే. ఇంతకు మించి నాది అనేది ఏదీ ఆయన వద్ద లేదు. మన దేశంలో అయితే గల్లీ లీడర్ కు కూడా... మంచి ఇళ్లు, స్థలాలు, ఖరీదైన కార్లు, నగలు, బ్యాంక్ బ్యాలెన్స్ లు కచ్చితంగా ఉంటాయి. ప్రధానిగా అధికార నివాసంలోకి వెళ్లకముందు... నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో పార్టీ కేటాయించిన ఓ అద్దె ఇంట్లో (ఖాట్మండూ శివార్లలో) ఉండేవారు. ప్రస్తుతం ప్రధాని హోదాలో అధికార నివాసంలో ఉంటున్నారు. బ్రహ్మచారి అయిన 75 ఏళ్ల కొయిరాలా చాలా సాధారణ జీవితం గడుపుతారు. ఆయన జీవన శైలిని కరడుగట్టిన కమ్యూనిస్టులు కూడా అనుసరించలేరని చెప్పుకుంటారు. ఇంకో విషయం ఏమిటంటే... కొయిరాలాకు బ్యాంకు ఖాతా కూడా లేదట.

  • Loading...

More Telugu News