: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,49,902 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 1946 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. వారం రోజుల్లో పరీక్షకు సంబంధించిన 'కీ' విడుదలవుతుంది.