: మహిళా సమాఖ్య అధ్యక్షురాలిపై అత్యాచారం... డీఆర్ డీఏ పీడీ అరెస్ట్


మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఏర్పాటైన ప్రభుత్వ సంస్థ డీఆర్ డీఏ. అయితే అక్కడ వెలుగులు ఏమో కానీ, మహిళల జీవితాలు చిధ్రం కూడా అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళా సమాఖ్య అధ్యక్షురాలిని అత్యాచారం చేసిన కేసులో ఏకంగా గ్రూప్-1 అధికారి హోదా కలిగిన డీఆర్ డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

ప్రాజెక్టు డైరెక్టర్ శివశంకర్, అతని సహాయకుడిని నిన్న మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్ట్ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని శివశంకర్ పలుమార్లు హెచ్చరించాడు. అంతేకాకుండా, ఈ ఘటనపై వరుస కథనాలు ప్రసారం చేస్తున్న ఓ టీవీ చానెల్ ప్రతినిధిని కూడా ఆయన ఫోన్లో హెచ్చరించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News