: 108 వాహనాన్ని, కారును ఢీకొన్న లారీ... ఐదుగురి మృతి
అదుపు తప్పిన ఓ లారీ 108 వాహనంతో పాటు ఓ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్టు సమాచారం. ఈ ఘటన నెల్లూరు జిల్లా సుందరయ్యనగర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది. మృతుల్లో ఎన్నికల విధులకోసం వచ్చిన ముగ్గురు బీహార్ పోలీసులతో పాటు, 108 సిబ్బంది ఉన్నారు.