: తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి పదవి వెనుకబడిన వర్గాలదే: చంద్రబాబు
తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి పదవి వెనకబడిన వర్గాలదేనని ఖమ్మం ప్రజాగర్జన సభలో మాట్లాడుతూ చంద్రబాబు పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. అవినీతి కుట్ర రాజకీయాలపై ప్రజాగర్జన చేసేందుకే ఇక్కడకు వచ్చానని ఆయన చెప్పారు. కేసీఆర్ తెలంగాణను దోచుకునేందుకే పుట్టాడని విమర్శించారు.