: ఖమ్మం జిల్లా విప్లవానికి గుమ్మం వంటిది: చంద్రబాబు
ఖమ్మం జిల్లా విప్లవానికి గుమ్మం వంటిదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఖమ్మంలో జరుగుతున్న ప్రజాగర్జన సభలో మాట్లాడుతూ చివరి రక్తపు బొట్టువరకూ సామాజిక తెలంగాణ కోసం పోరాడతానని తెలిపారు. ఎన్టీఆర్ కు ఖమ్మం అంటే ఎంత ప్రేమో, భద్రాచలం అన్నా అంత అభిమానమని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన కొనియాడారు. తొలిస్వాతంత్ర్య సమరం ఈ జిల్లాలోనే జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడం ఎవరి తరం కాదని, తెలంగాణలో సైకిల్ స్పీడ్ పెంచి బుల్లెట్లా దూసుకెళ్తామని అన్నారు.