: రాజమండ్రి వంతెనపై వేలాడుతున్న లారీ


రాజమండ్రిలో గోదావరి నదిపై ఉన్న రైలు కమ్ రోడ్ వంతెనపై పెను ప్రమాదం తప్పింది. పరిమితికి మించి వేగంగా వస్తున్న లారీ, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఫుట్ పాత్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఫుట్ పాత్ తో పాటు రెయిలింగ్ కూడా నుజ్జు నుజ్జై బ్రిడ్జిపై నుంచి లారీ వేలాడుతోంది. ఏ క్షణంలోనైనా లారీ గోదావరిలో పడిపోయే ప్రమాదం ఉంది. వేలాడుతున్న లారీలోంచి డ్రైవర్ రాంబాబు, క్లీనర్ మెల్లగా బ్రిడ్జిపైకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనాల రాకపోకలను నియంత్రించారు. లారీని బ్రిడ్జిపైకి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News