: అక్కడి నుంచి అయితేనే పోటీ చేస్తా: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
బీజేపీ పార్లమెంటు సభ్యుడు, మాజీ క్రికెటర్ అయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన మనసులో మాట బయటపెట్టాడు. తనకు అమృతసర్ స్థానాన్ని కేటాయిస్తేనే ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతానని సిద్ధూ స్పష్టం చేశాడు. న్యూఢిల్లీలో ఇవాళ బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. తనకు ఈ దఫా ఎన్నికల్లో అమృతసర్ కేటాయించాలని అధినాయకత్వాన్ని కోరినట్లు చెప్పారు. కాని పక్షంలో వేరే ఏ స్థానం నుంచీ కూడా పోటీ చేయనని తేల్చి చెప్పారు.
పస్తుతం అమృతసర్ స్థానాన్ని అరుణ్ జైట్లీకి కేటాయించడంతో సిద్ధూ తన అసహనాన్ని అగ్రనేతల వద్ద వెళ్లగక్కారు. తాను ఇంతకు ముందే అక్కడి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాను అమృతసర్ కాకుండా, వేరే చోట టిక్కెట్ ఇవ్వమని బీజేపీ పెద్దలను కోరలేదని సిద్ధూ తేల్చి చెప్పారు.