: ఆదివారం నాడు అనుచరులతో కావూరి కీలక సమావేశం
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్య అనుచరులతో ఆదివారం నాడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై కావూరి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం విదితమే.