: నెలాఖరుకల్లా అభ్యర్థులను ఖరారు చేస్తాం: డిగ్గీరాజా
ఈ నెల 24 నాటికి అభ్యర్థుల జాబితాను పీసీసీ నుంచి ఏఐసీసీకి అందించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల, ప్రచార, ప్రణాళిక కమిటీల సమావేశాలు ముగిశాయి. సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ, పీసీసీలు పంపిన జాబితాలను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి నెలాఖరుకల్లా అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు.