: పవన్ కల్యాణ్ చక్కగా మాట్లాడాడు: సుబ్బరామిరెడ్డి


కాంగ్రెస్ హఠావ్ దేశ్ బచావ్ అన్న పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజకీయ చతురత ప్రదర్శించింది. అతని వ్యాఖ్యలపై స్పందించేందుకు టి సుబ్బరామిరెడ్డిని రంగంలోకి దించింది. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టే అవకాశం ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ ముక్కు సూటి మనిషి అని, తనకు పవన్ కల్యాణ్ అన్నా, అతని అభిమానులన్నా చాలా ప్రేమ, అభిమానం ఉన్నాయని తెలిపారు.

పవన్ కల్యాణ్ కు సమాజ శ్రేయస్సు కావాలని, సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించడం మంచి అలవాటని ఆయన అన్నారు. తాను పవన్ కల్యాణ్ ను చాలాసార్లు కలిశానని, పవన్ కల్యాణ్ ప్రకటించిన ఆశయాలు చాలా బాగున్నాయని అన్నారు. పదవుల కంటే ప్రజలు ముఖ్యమని ప్రకటించడం ఆనందదాయకమని అన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకరించాయని పవన్ కల్యాణ్ గుర్తించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News