: చిన్నారిని కాపాడిన గజరాజు


కొన్ని సందర్భాల్లో జంతువులు వాటి స్వాభావిక నైజాన్ని పక్కనబెట్టి విచక్షణ ప్రదర్శించిన సంఘటనలు తెలిసిందే. తాజాగా, పశ్చిమబెంగాల్లో ఇలాంటి ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. పురూలియా జిల్లాలోని ఓ గ్రామంలోకి సమీప అటవీప్రాంతం నుంచి ఓ ఏనుగు ప్రవేశించింది. కనిపించినవన్నీ ధ్వంసం చేస్తూ ఓ ఇంటిని పడదోసింది. ఇక అడవికి తిరుగుప్రయాణం అవుతుండగా ఆ ఇంటి శిథిలాల కింద చిన్నారి ఏడుపు వినిపించింది.

అంతే, వెళ్ళబోతున్న ఆ గజరాజు వెనుదిరిగి వచ్చి శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారిని జాగ్రత్తగా తొండంతో బయటికి తీసింది. అనంతరం ఆ పాపను ఆసుపత్రిలో చేర్చగా ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఆ ఏనుగు తమ గ్రామంలో ఇప్పటివరకు ముగ్గురిని బలిగొందని, ఇప్పుడిలా ప్రవర్తించడం ఆశ్చర్యకరమని గ్రామస్తులంటున్నారు.

  • Loading...

More Telugu News