: పవన్ కల్యాణ్ గుర్తించాలి: డొక్కా
భావోద్వేగాలు, ఆవేశంతో ప్రజలకు న్యాయం జరగదని పవన్ కల్యాణ్ గుర్తించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ చెబుతున్న సిద్ధాంతాలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయని, అది గుర్తించే చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేశారని అన్నారు. చిరంజీవికి పవన్ కల్యాణ్ సొంత తమ్ముడైతే, తనలాంటి వాళ్లంతా రాజకీయ తమ్ముళ్లని అన్నారు.