: మిస్సయిన మలేసియా విమాన పైలెట్ కు పడతుల పిచ్చి!
మలేసియా జెట్ విమానం అదృశ్యమై వారం గడిచిపోయింది. అయినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో పరిపరివిధాలా అనుమానాలు బయల్దేరాయి. ఈ క్రమంలో మలేసియా అధికారులు విమాన పైలెట్ ఫారిక్ అబ్దుల్ వ్యవహారశైలిపైనా ఆరా తీశారు. సదరు ఎయిర్ లైన్స్ వారు చెప్పిన విషయాలు విని వారు ఆశ్చర్యపోయారట. అమ్మాయిల కోసం వెంపర్లాడతాడన్నది ప్రాథమిక సమాచారం. 2011లో విమాన కాక్ పిట్ లోకి ఇద్దరు దక్షిణాఫ్రికా యువతలను రప్పించుకుని, వారితో ఫొటోలు దిగి వార్తల్లోకెక్కింది ఇతగాడే. అతడి పూర్తి సమాచారం సేకరించిన అధికారులు ఇప్పుడు విమానం మిస్సవడంతో ఈ కొత్తకోణంలోనూ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు.