: రేపటి నుంచి కాంగ్రెస్ సంగతి చూస్తా: కేసీఆర్


తాను లేకుంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడో చిదిమేసేవారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. రేపట్నుంచి కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తామని హెచ్చరించారు. ఆంధ్రా దొంగ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది అప్పటి మంత్రి, ఇప్పటి పీసీసీ అధ్యక్షుడు పొన్నాలే అని దుయ్యబట్టారు. "రేపటి నుంచి నీ సంగతేందో, నా సంగతేందో తేల్చుకుందాం" అంటూ పొన్నాలకు సవాల్ విసిరారు.

ఓ వైపు విలీనం, పొత్తులు అంటూనే దిగ్విజయ్ సింగ్ టీఆర్ఎస్ నేతలను లాగే ప్రయత్నం చేస్తున్నారని... ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఇదేనా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి పోతారో? లేక కాంగ్రెస్ నేతలే టీఆర్ఎస్ లోకి వస్తారో? చూడండని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కనీసం పొత్తు కూడా ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News