: ప్రజా నిర్ణయం మేరకే కాంగ్రెస్ లో విలీనం చేయలేదు: కేసీఆర్


తెలంగాణ ప్రజల నిర్ణయం మేరకే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయకూడదని తీర్మానించామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ వెల్లడించారు. ఎందరో బిడ్డలు ప్రాణత్యాగం చేస్తుంటే... ప్రాణత్యాగాలు ఆపడం కోసమే అప్పట్లో విలీనం చేస్తామని ప్రకటించామన్నారు. కేసీఆర్ మోసం చేశాడని విమర్శిస్తున్నారని... ఏం మోసం చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నెల రోజులు ఢిల్లీలోనే ఉన్నానని... కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం విలీనం గురించి మాట్లాడలేదని ఆరోపించారు. తెలంగాణ పోరాటం జరిగిందే నీరు, ఉద్యోగాలు, నిధుల కోసమని చెప్పారు. తమ బాధలను, అవసరాలను దిగ్విజయ్, జైరాం రమేష్ లకు ఎన్నోసార్లు చెప్పినా... వారు తమ మాట వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో 80 శాతం మంది ఆంధ్రా ఉద్యోగులే ఉన్నారని... అక్రమంగా ఇక్కడ ఉంటున్న ఉద్యోగులను పంపించి వేయాలన్నారు.

  • Loading...

More Telugu News