: ధోనీ ప్రస్థానంపై సినిమా
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితాన్ని తెరకెక్కించేందుకు బాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ చిన్న పట్టణం నుంచి వచ్చిన యువకుడు ప్రపంచవ్యాప్త క్రేజ్ సంపాదిచడం ఇతివృత్తంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ధోనీ పాత్రలో యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించనున్న ఈ చిత్రానికి నీరజ్ పాండే దర్శకుడు. పాండే దర్శకత్వంలో ఇంతకుముందు 'ఏ వెడ్నెస్ డే 2008' చిత్రం వచ్చింది.
ఈ సినిమాకు ధోనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే హీరో రాజ్ పుత్... ధోనీ స్వస్థలం రాంచీ వెళ్ళొచ్చాడు. అక్కడ ధోనీ తిరిగిన ప్రదేశాలు, సన్నిహితుల వద్ద అతని జ్ఞాపకాలు... ఇలా అన్నింటిపైనా కొంత అవగాహన సంపాదించాడట. ధోనీ పాత్రలో ఒదిగిపోయేందుకు ఇవి ఉపయోగపడతాయని రాజ్ పుత్ భావిస్తున్నాడు. ఈ చిత్రంలో ధోనీ అర్థాంగి సాక్షి పాత్రలో నటించేందుకు దీపిక పదుకొనే గానీ, శ్రద్ధా కపూర్ గానీ ఎంపికయ్యే అవకాశాలున్నాయి.