: నా ఉద్యోగం నాకిప్పించకపోతే చస్తా: రాజ్ భవన్ ముందు మహిళ
న్యాయం కోరుతూ ఓ మహిళ రాజ్ భవన్ ముందు తన కుటుంబంతో ఆందోళనకు దిగింది. కర్నూలు జిల్లాకు చెందిన రమాదేవి అనే యువతి ఉద్యోగ నియామకంలో తనకు అన్యాయం చేశారని ఆరోపించింది. తనకు కేటాయించాల్సిన ఉద్యోగాన్ని పరీక్షకు హాజరుకాని మరొకరికి కేటాయించారని, గవర్నర్ కల్పించుకుని తనకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. గవర్నర్ ను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడే బైఠాయించింది. దీంతో గవర్నర్ ను కలిసేందుకు పోలీసులు ఆమెను అనుమతించారు.