: మహబూబ్ నగర్ నుంచి జైపాల్ రెడ్డి పోటీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. గతంలో చేవెళ్ల నుంచి గెలిచిన జైపాల్, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహబూబ్ నగర్ లోని లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థిత్వాలపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.