: సింధు సంచలన విజయం... సైనా ఓటమి
స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగుతేజం పుసర్ల వెంకట సింధు సంచలన విజయం నమోదు చేసింది. ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ గెలిచిన చైనా అమ్మాయి షిజియాన్ వాంగ్ ను చిత్తుగా ఓడించింది. స్విట్జర్లాండ్ లోని బసెల్ లో జరుగుతున్న ఈ టోర్నీలో సింధు క్వార్టర్ ఫైనల్లో 21-17, 21-15 తో వాంగ్ ను ఇంటికి పంపింది. కెరీర్లో షిజియాన్ పై సింధుకు ఇది మూడో విజయం.
కాగా, మరో మ్యాచ్ లో భారత నెంబర్ వన్ షట్లర్ సైనా నెహ్వాల్ కు ఓటమి ఎదురైంది. చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 3 క్రీడాకారిణి యిహాన్ వాంగ్ తో పోరులో సైనా 17-21, 2-21తో పేలవరీతిలో చేతులెత్తేసింది. పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ సెమీస్ చేరాడు. క్వార్టర్స్ లో కశ్యప్ 21-15, 21-23, 21-18తో టీయెన్ పై నెగ్గాడు.