: 11 మంది మావోయిస్టుల అరెస్ట్
చత్తీస్ గఢ్ లో 11 మంది మావోయిస్టులను భద్రతాదళాలు ఈ ఉదయం అరెస్ట్ చేశాయి. బలరాంపూర్ జిల్లా లహ్ సూన్ పత్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు తారసపడగా.. వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకోగలిగారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఒక పిస్టల్, రెండు డిటోనేటర్లు, ఒక .325 బోర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం మావోయిస్టులు 15 మంది పోలీసులను హత్యచేసిన విషయం తెలిసిందే. అనంతరం కూంబింగ్ ను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వీరు పట్టుబడ్డారు.