: పవన్ కల్యాణ్ ని ఆసుపత్రిలో చేర్పించాలి: కోమటిరెడ్డి
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా పవన్ కల్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ను ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలను కించపరిచి మాట్లాడారని అన్నారు. తనకు హైకమాండ్ ప్రజలేనని కోమటి రెడ్డి తెలిపారు.