: తూర్పులో రేపటి నుంచి ‘జనభేరి‘ మోగించనున్న జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో ‘జనభేరి’ మోగించనున్నారు. జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు నుంచి రాజమండ్రిలో అడుగుపెడతారని వైఎస్సార్సీపీ శ్రేణులు తెలిపాయి. రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో రోడ్ షో నిర్వహిస్తారు. 17వ తేదీ ఉదయం అమలాపురంలో రోడ్ షో, అదే రోజు మధ్యాహ్నం ముమ్మిడివరంలో రోడ్ షో అనంతరం సాయంత్రం ఐదు గంటలకు రామచంద్రాపురంలో జరిగే బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. ఇక, 18వ తేదీన ఆయన పిఠాపురం, ఏలేశ్వరం, తునిలో ప్రచారాన్ని కొనసాగిస్తారు. ఈ రోడ్ షోల్లో ఆయనతో పాటు మున్సి‘పోల్స్’ అభ్యర్థులు కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.