: టెన్త్ పాసయ్యే వరకు పెళ్ళిచేసుకోడట... ఆయన వయసు 80 ఏళ్ళు!
ఆయన పేరు శివ్ చరణ్ యాదవ్. వయసు 80 ఏళ్ళు. మనుమలతో ఆడుకోవాల్సిన వయసు. ఉండేది రాజస్థాన్ లోని బహ్రోర్ ప్రాంతంలో. కానీ, ఆ ముదుసలి ఇంతవరకు పెళ్ళిచేసుకోలేదు. విషయం ఏంటని ఆరా తీస్తే, తాను టెన్త్ క్లాస్ పాసయితేనేగానీ వివాహమాడేది లేదని తెగేసి చెబుతాడు. ఇంతకీ అతగాడు ఎన్నిసార్లు ఫెయిలయ్యాడో తెలుసా...? 44 సార్లు బోల్తా కొట్టాడట పబ్లిక్ పరీక్షల్లో. ఆ పట్టుదలకు అచ్చెరువొందాలో, టెన్త్ క్లాస్ కు పెళ్ళికి ముడిపెట్టిన అతగాడి మూర్ఖత్వానికి జాలిపడాలో అర్థంకాని పరిస్థితి నడుమ... అధికారులు ఇప్పటికీ అతడిని పరీక్షలకు అనుమతిస్తూనే ఉన్నారు.