: నితీశ్ ను ప్రసన్నం చేసుకోనున్న కేంద్రం


బీహార్ కు వెనుకబడిన రాష్ట్రంగా ప్రత్యేక హోదా కల్పించాలంటూ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీసుకువస్తున్న ఒత్తిడికి యూపీఏ ప్రభుత్వం తలవంచనుంది. రాజకీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత తరుణంలో నితీశ్ ను ప్రసన్నం చేసుకోవడమే మంచిదని.. అందుకోసం ఆయన డిమాండ్ నెరవేర్చి బుట్టలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. వెనుకబడిన హోదాను కల్పించే విషయంలో నిబంధనల విధానాన్ని మారుస్తున్నామని, రానున్న నెలల్లో ఇది పూర్తవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు చూచాయిగా చెప్పాయి.

ఈ నిబంధనల విధానాన్ని మారిస్తే బీహార్ సహా జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిసా, రాజస్థాన్ రాష్ట్రాలు వెనుకబడిన హోదాకు అర్హత సాధిస్తాయి. స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరినట్లు, ఇటు ప్రభుత్వ మనుగడకు ముప్పు వస్తే నితీశ్ అండ పొందవచ్చన్న  ఆశ, అటు వచ్చే ఎన్నికలలో వెనుకబడిన అర్హత కల్పించిన రాష్ట్రాలలోనూ తాము రాజకీయంగా బలపడొచ్చన్న ఆకాంక్షతో కేంద్రం ఈ దిశగా చర్యలు చేపట్టింది. 

  • Loading...

More Telugu News