: తొమ్మిది నెలలుగా మీడియా నన్ను బహిష్కరిస్తోంది: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాపై ఇంకా తన వాగ్బాణాలను సంధిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, తొమ్మిది నెలలుగా మీడియా తనను బహిష్కరిస్తోందని ఆరోపించారు. కాగా, నిన్న ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. కొన్ని మీడియా చానళ్లు మోడీకి అమ్ముడు పోయాయని, అధికారంలోకి రాగానే వాళ్ళను జైలుకు పంపుతామని కేజ్రీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.