: టి20 ప్రపంచకప్ లో రెహ్మాన్, అకోన్ జంట కచేరీ


వచ్చే శుక్రవారం బంగ్లాదేశ్ వేదికగా టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. రేపటి నుండి క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. కాగా, టోర్నీ మెయిన్ డ్రా ప్రారంభానికి ఒకరోజు ముందు, అంటే, గురువారం సంగీత కచేరీ ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఆస్కార్ విజేత, భారత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, ఇంటర్నేషనల్ ఆర్ అండ్ బి సింగర్ అకోన్ తమ గానాలాపనతో వీక్షకులను అలరించనున్నారు. రెహ్మాన్ గత మంగళవారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉపఖండంలోని సంగీత రీతులు, కార్యక్రమ సరళిపై ఆమెతో చర్చించారు.

కాగా, ఈ టోర్నీకి అధికారిక ప్రారంభోత్సవం అంటూ ఏమీలేకపోయినా, ఈ సంగీత సామ్రాట్టుల గానమాధుర్యం ఆ లోటు తీర్చుతుందని బంగ్లా బోర్డు భావిస్తోంది. ఈ కచేరీ కోసం మార్చి 8 నుంచి టికెట్ల జారీ ఆరంభించగా, టికెట్లన్నీ ఈసరికే అమ్ముడయ్యాయి.

  • Loading...

More Telugu News