: చంద్రబాబుపై అలిగిన మాట నిజమే: ఎర్రబెల్లి
దేశానికి నరేంద్ర మోడీ, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం ఎంతో ఉందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. తెలంగాణ టీడీపీ కమిటీ ఏర్పాటు విషయంలో తాను పార్టీ అధినేత చంద్రబాబుపై అలిగిన విషయం వాస్తవమే అని స్పష్టం చేశారు. ఈ రోజు టీటీడీపీ కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.