: దేవయాని అరెస్టుకు వారెంట్ జారీ


తన ఇంట్లో పనిచేసే సహాయకురాలికి తక్కువ జీతాన్ని చెల్లించి ‘శ్రమ దోపిడీ’కి పాల్పడ్డారన్న నేరారోపణలపై భారతీయ దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేపై తాజాగా వీసా మోసం అభియోగాలు నమోదయ్యాయి. ఆమె అరెస్టుకు న్యూయార్క్ అధికారులు వారెంట్ జారీ చేశారు. డిసెంబరు 12న న్యూయార్కులో అరెస్టయిన 39 సంవత్సరాల దేవయానిని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీకి బదిలీ చేసింది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఇప్పటికీ అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆమె అమెరికాను సందర్శించిన పక్షంలో అరెస్టును ఎదుర్కొనక తప్పదు.

  • Loading...

More Telugu News