: అక్కకు సాయం చేయబోయి... అడ్డంగా బుక్కైన చెల్లెలు


అక్కకు సాయం చేయాలనుకుని ఓ చెల్లెలు అడ్డంగా బుక్కైపోయింది. పదేపదే ఫెయిలవుతున్న అక్కకు బదులు పరీక్షరాసి అధికారులకు దొరికిపోయింది. దీంతో అక్కా, చెల్లెలు ఇద్దరూ కటకటాలపాలయ్యారు. హైదరాబాదులోని చంచల్ గూడలో నివాసముండే యువతి(29) ఇంటర్ చాలా కాలంగా తప్పుతోంది. ఈ సారి ఎలాగైనా పాస్ కావాలనే లక్ష్యంతో డబీపురా నూర్ ఖాన్ బజార్ కు చెందిన చెల్లిని ఆశ్రయించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది.

తన బదులు ఆమె పరీక్ష రాసేందుకు ఒప్పించి, జాంబాగ్ లోని పరీక్షా కేంద్రం వివేకవర్ధిని కాలేజీకి పంపించింది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన అధికారులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దర్నీ రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News