: ఇస్రోతో నాగార్జున వర్శిటీ ఒప్పందం
భూమి నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని 10 వస్తువులను గుర్తించగల ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు ‘‘మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్’’పై ఇస్రోతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్శిటీ ఇంజనీరింగ్ విభాగానికి దక్కింది. ఉపగ్రహాల గమనాన్ని నిర్దేశించడానికి, మానవ సహిత రోదశీ నౌకలను నియంత్రించడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని యూనివర్శిటీ ఇంజనీరింగ్ విభాగాధిపతి సిద్ధయ్య అన్నారు. 24 నెలల పాటు జరుగనున్న ఈ ప్రాజెక్టుకు రూ.28 లక్షలు మంజూరు చేశారని, ఒక టెక్నికల్ అసిస్టెంట్, ముగ్గురు రీసర్చ్ ఫెలోస్ ను ఈ ప్రాజెక్టుకు కేటాయించారని ఆయన పేర్కొన్నారు.