: నేటి నుంచే బ్రిక్స్ సమావేశాలు
బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాలు నేటి నుంచి దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ప్రారంభం అవుతున్నాయి. ఇందుకోసం డర్బన్ లోని కాన్ఫరె న్స్ సెంటర్ కు తుది మెరుగులు దిద్దారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొంటారు. రెండు రోజులపాటు జరగనున్న సమావేశాల్లో తమ వాణిజ్య విధానంపై ఐదు దేశాలు చర్చిస్తాయి.
ఆర్థిక అంశాలు, దేశ రాయబార అంశాలు కూడా సమావేశాల్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు కేంద్ర మంత్రులు చిదంబరం, ఆనంద్ శర్మ తదితరులతోకూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం నిన్ననే డర్బన్ కు చేరుకుంది.