: గాలి విచారణను వాయిదా వేసిన బళ్లారి న్యాయస్థానం
పరువునష్టం కేసులో గాలి జనార్థనరెడ్డిపై రేపు జరగాల్సిన విచారణను బళ్లారి న్యాయస్థానం వాయిదా వేసింది. బళ్లారికి గాలి జనార్థన్ రెడ్డి వస్తే..ఆయనకు రక్షణ కల్పించలేమని స్థానిక పోలీసులు తెలుపడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో గాలి జనార్థన్ రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.