: కేజ్రీవాల్ బెదిరింపులపై రాష్ట్రపతి, ఈసీకి బీజేపీ ఫిర్యాదు
ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బెదిరింపు వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. మీడియా అంతా బీజేపీకి అమ్ముడుపోయిందని, మోడీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్న కుట్రపై తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరిపి జర్నలిస్టులు సహా దోషులందరినీ జైల్లో వేస్తామంటూ కేజ్రీవాల్ నిన్న బెదిరించిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ తెలిపారు. మీడియాను బెదిరించడం అంటే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలాంటి వ్యవస్థపై దాడి చేయడమేనన్నారు.