: జనసేన వెనుక రహస్య అజెండా: పొంగులేటి
'కాంగ్రెస్ హఠావో... దేశ్ బచావో' అంటూ పిలుపిచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. వంద మంది పవన్ కల్యాణ్ లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరని అన్నారు. ఆయన సినీ డైలాగులు ఎంతో కాలం పని చేయవని చెప్పారు. పవన్ జనసేన వెనుక రహస్య అజెండా దాగి ఉందని అన్నారు.