: బ్యాంకుల నోట 'అప్పులు అమ్మబడును' ప్రకటన
బ్యాంకులు రుణాలివ్వడం, వాటిపై వడ్డీ వసూలు చేయడం సాధారణం. కానీ, ఇప్పుడు ఇలా ఇచ్చిన రుణాలను మరొకరికి అమ్మి భారం దింపుకొనేందుకు బ్యాంకులు తయారయ్యాయి. గడువు దాటినా రుణాలు తిరిగి రాకుంటే బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సుదీర్ఘకాలం వసూలు కాకుండా ఉండిపోయిన రుణాలను బ్యాంకులు మొండి బకాయిల్లోకి చేరుస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటోనూ మొండి బకాయిలను కలిపితే 1.80లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనా.
ఈ నేపథ్యంలో మొండి బకాయిలను వేరొకరికి అమ్ముకోవడం ద్వారా కష్టాల నుంచి బయటపడాలని అవి భావిస్తున్నాయి. 40 బ్యాంకులు రూ.42,800 కోట్ల రూపాయల రుణాలు విక్రయానికి ప్రకటనలు జారీ చేశాయి. వీటి కోసం బిడ్లను ఆహ్వానిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి మొండి బకాయిలను అస్సెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీలు తక్కువకు కొనుగోలు చేసి తమకు తెలిసిన మార్గాల ద్వారా రుణగ్రహీతల నుంచి బకాయిలను రాబట్టుకుంటాయి. ఎస్ బీఐ రూ.7,600, బీఓఐ రూ.4,600 మొండి రుణాల విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.